దీపావళి పండగ ప్రయాణం ప్రాణాల మీదకు తెస్తోంది. ఎక్కడ చూసినా ఒకటే రద్దీ. బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. అక్కడ తొక్కిసలాటలు జరగుతున్నాయి. ఆర్థిక రాజధాని ముంబయిలో ముంబయి రైల్వే స్టేషన్‌లో తెల్లవారు జామున జరిగిన తొక్కిసలాటలో 9 మందికి గాయాలయ్యాయి.
బాంద్రా నుంచి యూపీలోని గోరఖ్‌పూర్ వెళుతున్న రైలు తెల్లవారుజామున 2.25 గంటల ప్రాంతంలో ముంబై రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికే ఆ రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు చేరకున్నారు. రైలు ప్లాట్ ఫారమ్ మీదకు రాగే ప్రజలు రైలులోకి ఎక్కేందుకు ఎగబడ్డారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది.
జనం ఎక్కువ కాడంతో కొందరు కిందపడిపోయారు. పడిపోయిన వారిని పట్టించుకోకుండానే జనం రైలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద నెట్ వర్కుగా చెప్పుకునే రైల్వే వ్యవస్థ ప్రత్యేక పర్వ దినాలలో నేటికి జనానికి తగినన్ని రైళ్ళను అందుబాటులోకి తీసుకు రాలేకపోవడం విచారకరం.