ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ కేవలం పచ్చి అబద్ధాల పుట్ట అని, చంద్రబాబు నాయుడు అంకెల గారడీతో ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన ‘సూపర్ సిక్స్’, ‘సూపర్ సెవెన్’ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడానికి ఈ బడ్జెట్‌ను ఒక సాకుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఆదాయం పడిపోయిందని జగన్ గణాంకాలతో వివరిస్తూ, ముఖ్యమంత్రి వైఖరిని ఎండగట్టారు.
అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్.. జగన్ పది ప్రశ్నలు
చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసత్య ప్రచారాలు చేస్తోందని జగన్ ధ్వజమెత్తారు. గత పదేళ్ల అప్పుల వివరాలను ఆయన బహిర్గతం చేశారు.
అప్పుల లెక్క: 2014లో రాష్ట్ర అప్పు రూ. 1,47,717 కోట్లుగా ఉంటే, 2019 నాటికి అది రూ. 3,90,247 కోట్లకు చేరిందని గుర్తు చేశారు. అంటే చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో భారీగా అప్పులు చేశారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం: ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల్లోనే రూ. 3,17,448 కోట్లు అప్పు చేసిందని, ఇంత భారీ మొత్తం ఎక్కడికి పోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆదాయం: 2024-25లో రూ. 1,19,927 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి, వాస్తవానికి కేవలం రూ. 94,937 కోట్లు మాత్రమే వచ్చిందని, బడ్జెట్ అంచనాలు అన్నీ తలకిందులయ్యాయని ఎద్దేవా చేశారు.
పెన్షన్ల కోత.. సంక్షేమానికి మంగళం
సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని జగన్ ఆరోపించారు. ముఖ్యంగా పింఛన్ల విషయంలో పేదలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పెన్షన్ల తొలగింపు: గత 18 నెలల్లోనే సుమారు 5.38 లక్షల పింఛన్లను ప్రభుత్వం కట్ చేసిందని, రాబోయే ఏడాదిలో మరో 7.45 లక్షల పింఛన్లు తొలగించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
బాకీలు: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీని విస్మరించడం వల్ల సుమారు 20 లక్షల మందికి రూ. 1,44,000 కోట్లు ప్రభుత్వం బాకీ పడిందని లెక్కలు చెప్పారు.
ప్రచారమే పీక్.. పర్ఫార్మెన్స్ వీక్: చంద్రబాబు పాలన అంతా పబ్లిసిటీ కోసమే తప్ప, ప్రజలకు ఒరిగిందేమీ లేదని, విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
Summary: YSRCP chief Y.S. Jagan Mohan Reddy launched a scathing attack on the Chandrababu Naidu-led coalition government following the presentation of the AP Budget 2026-27. Terming it a “bundle of lies,” Jagan alleged that the government has failed to allocate funds for its “Super Six” election promises while pushing the state into a massive debt trap. He claimed that the current administration borrowed over ₹3.17 lakh crore in just 18 months, yet failed to pay employee arrears or clear farmer dues. Furthermore, Jagan highlighted the reduction in the number of pensioners and accused the Chief Minister of fabricating growth figures to mask an economic slowdown, stating that the state’s performance is weak despite high-decibel publicity.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.