జనసంద్రంగా మారిన సింగరాయ జాతర: లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని కూరెళ్ళ, తంగళ్ళపల్లి గ్రామ శివారులలో వెలసిన శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఆదివారం (18-01-2026) భక్తజన సంద్రమైంది. ఏటా పుష్య బహుళ అమావాస్య సందర్భంగా జరిగే ఈ చారిత్రాత్మక జాతరకు ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు
ఈ జాతరకు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరిపై లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులందరికీ జాతర శుభాకాంక్షలు తెలియజేశారు.
#SingarayaJatara #SiddipetNews #PonnamPrabhakar #TelanganaCulture #SingarayaSwamy
