జగన్-షర్మిల ఆస్తుల వ్యవహారం రాష్ట్ర సమస్యగా మార్చేస్తున్నారు. స్వంత వ్యవహారంపై అటు అధికారపార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ పరస్పర ఆరోపణలు చేసుకున్నుంటున్నాయి. ఆంధ్రజ్యోతి రాజేసిన అగ్గి ఇరు పార్టీల నడుమ రగులుకుంటోంది.
రాష్ట్రంలో ఎన్నో సమస్యలుండగా జగన్,షర్మిల ఆస్తుల గొడవను ప్రధాన శీర్షికగా ప్రచురించి కొత్త, చెత్త చర్చకు తావు ఇచ్చారు. దీనిపై అధికార పార్టీకి చెందిన నాయకులు మంత్రులు పదే పదే విమర్శలు చేస్తుంటే గురువారం మాజీ ముఖ్యమంత్రి జగన్ దీనిపై స్పందించారు. ఇలాంటి గొడవలు ఎవరి ఇంట్లోనైనా సహజమేనని అధికార పార్టీ నాయకుల ఇళ్ళలో ఇలాంటివి లేవా? వారు ఎంతమందికి ఎన్ని ఆస్తులు పంచారని ప్రశ్నించారు. అదే సమయంలో తమ కుటుంబ వ్యవహారాన్ని తెరపైకి తీసుకు వచ్చి రాష్ట్ర సమస్యలను పక్కదారిపట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
దీనికి ప్రతిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తల్లి,చెల్లితో గొడవ అయితే మమ్మల్ని లాగుతున్నారని జగన్‌ను ప్రశ్నించారు. తండ్రి సంపాదించిన ఆస్తి ఆయన భార్యకు రాదా? ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇలాంటి వాళ్లతో రాజకీయం చేయాలంటే సిగ్గుగా ఉందని వ్యాఖ్యానించారు. చిల్లర రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. విలువలు లేని మనుషులు సమాజానికి చేటు
ఐదేళ్లు నన్ను ఇంట్లో నుంచి బయటికి రానివ్వలేదని అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఆపాలంటే నిమిషం పట్టదని హెచ్చరించారు.
మొత్తానికి వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారం రోడ్డుకెక్కింది ఇది ఎప్పటికి సమసిపోతుందో, ప్రజాసమస్యలు ఎన్నడు గుర్తోస్తాయో.