అమెరికాలో మంచు తుపాను బీభత్సం.. వేలాది విమానాలు రద్దు
అమెరికాను భారీ మంచు తుపాను వణికిస్తోంది. క్రిస్మస్ పండుగ ప్రయాణాల సమయంలో వాతావరణం తీవ్రంగా మారడంతో విమానయాన రంగంపై భారీ ప్రభావం పడింది. దేశంలోని మిడ్‌వెస్ట్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ హిమపాతం హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం ఒక్కరోజే 1,191కు పైగా విమానాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఫ్లైట్ అవేర్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, నిన్న మధ్యాహ్నం 1 గంట సమయానికి 1,191 విమానాలు రద్దు కాగా, మరో 3,974 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఈ పరిస్థితితో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద నగరమైన న్యూయార్క్‌లో రాత్రికి రాత్రే 10 అంగుళాల వరకు మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోవచ్చని హెచ్చరించింది. (Flight Cancellations USA)
మంచు తుపాను కారణంగా రహదారులు జారుడుగా మారడంతో రవాణా వ్యవస్థ కూడా స్తంభించే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు విమానాశ్రయాల్లో ఆలస్యాలు, రద్దులు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. (Winter Weather Alert)
#USSnowstorm
#FlightCancellations
#WinterStorm
#USWeather
#TravelAlert