తిరుపతిలో రహదారి భద్రత హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ
రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం నింపే లక్ష్యంతో తిరుపతిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుంచి TUDA మునిసిపల్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది. రవాణా, పోలీస్ శాఖలతో పాటు బాలాజీ బైక్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో తిరుపతిలో రహదారి భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుంచి TUDA మునిసిపల్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు. రవాణా శాఖ, పోలీస్ శాఖ, బాలాజీ బైక్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో వాహనదారులు పాల్గొన్నారు.ఈ ర్యాలీలో అధికారులు, వాహనదారులు రోడ్డు భద్రతా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడటం నివారించడం, లేన్ క్రమశిక్షణ పాటించడం వంటి కీలక చర్యలపై దృష్టి సారించారు. ముఖ్యంగా యువతలో బాధ్యతాయుత డ్రైవింగ్ పద్ధతులు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.ర్యాలీ ప్రారంభం ముందు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది. వక్తలు ప్రమాదాల ప్రధాన కారణాలను వివరించి, ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. జిల్లా రవాణా శాఖ అధికారి కొ ర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ, మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 129 ప్రకారం హెల్మెట్ విధిగా ధరించాలని దీన్ని పాటించకపోతే సెక్షన్ 194D ప్రకారం ₹1,000 జరిమానా, మూడు నెలల డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ విధించబడుతుందని హెచ్చరించారు.డిప్యూటీ మేయర్ మునికృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ లేకుండా పెట్రోల్ ఇవ్వకూడదనే నిర్ణయాన్ని ప్రశంసించారు.
ట్రాఫిక్ సిఐ సంజీవ్ కుమార్ ఈ సందర్భంగా “సడక్ యోగి (Sadak Yogi)” భావనను పరిచయం చేసి, వాహనదారులు ప్రశాంతత, క్రమశిక్షణ, సహనం, అవగాహనతో డ్రైవ్ చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జనసేన నగర ఇంచార్జ్ రాజారెడ్డి మాట్లాడుతూ శిరస్రాణం భారం కాదని అది జీవితానికి భరోసా అని తెలియజేశారు. కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, మోహన్ కుమార్, వెంకటరమణ నాయక్, ఆంజనేయ ప్రసాద్, స్వర్ణలత మరియు బాలాజీ బైక్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ మరియు సెక్రటరీ హరిప్రసాద్ మొదలైనవారు పాల్గొన్నారు.
#Tirupati #RoadSafety #TrafficRules #HelmetAwareness #SafeDriving #TirupatiPolice #SadakYogi
