March 27, 2026

కేసీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేదు – సీఎం రేవంత్

  • ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
  • కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు ప్రధాన శత్రువులని ధ్వజమెత్తిన సీఎం

న్యూఢిల్లీ, జూన్ 11: తాను సీఎం‌గా ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశం ఉండదని  సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో జాతీయ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి KCR family ప్రధాన అడ్డంకిగా మారిందని ఆరోపించారు. తాజాగా కేసీఆర్ Kaleshwaram Projectపై స్పందించడంపై, తాను కూడా రెండు రోజుల్లో ప్రెస్‌మీట్ పెట్టి ప్రాజెక్ట్‌ అవినీతి, జలసాధన వివరాలను ప్రజలకు వివరించబోతున్నానని ప్రకటించారు.

మంత్రుల శాఖల కేటాయింపు, అధిష్టానంతో చర్చ లేదు
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు విషయంపై కూడా స్పష్టత ఇచ్చిన సీఎం రేవంత్, తన వద్ద ఉన్న portfolios నుంచే వారికి కేటాయిస్తానని తెలిపారు. Congress high commandతో కేవలం Karnataka caste census విషయంలోనే చర్చ జరగిందని, ఇతర విషయాలపై చర్చలేవు అని చెప్పారు. తన నిర్ణయాలతోనే రాష్ట్రంలో పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కేసీఆర్ చుట్టూ ఉన్న ‘దయ్యాల’ గురించి సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్న కవితను ఉటంకించిన సీఎం రేవంత్, “అప్పుడు కమిషన్ విచారణకు వెళ్ళిన కవిత కూడా ఆ దయ్యాల్లో ఒకటా?” అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు శాపంగా మారిందని వ్యాఖ్యానించారు. తాను సీఎం గా ఉన్నంతవరకు వాళ్లకు  కాంగ్రెస్ పార్టీలో ప్రవేశంలేదు అని మరోసారి హచ్చుతెచ్చారు.

కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు – ప్రాజెక్టులు ఏమి తీసుకురాలేదన్న ఆరోపణ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి, తెలంగాణ అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నారని ఆరోపించారు. “కిషణ్ రెడ్డి ఒక్క ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి తీసుకురాలేదు. చెన్నయ్ కు  నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ కర్ణాటకు మెట్రో ఇచ్చారన్నారు. మరి కిషన్ రెడ్డి తెలంగాణకు ఏమి చేశారు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని మోదీకి ఒక్కసారి అయినా రాష్ట్ర ప్రాజెక్టులపై నివేదిక ఇచ్చారా? అని నిలదీశారు. తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత చూపుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *