10 నుంచి 20 శాతం వరకు పెరగనున్న ఆస్తుల విలువలు
విజయవాడ, అక్టోబర్ 26 : వచ్చే డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలో ఆస్తుల విలువలు పెరగనున్నయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో దాదాపు అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్తుల విలువలు పెరిగాయి.
వ్యవసాయ భూములతోపాటు నివేశన స్ధలాలు, భవనాల రేట్లు కనీసం 15 నుంచి 20 శాతం పెరిగాయి. అయితే ప్రభుత్వ ఆదాయం ఆ మేరకు పెరగలేదు. పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన పరిస్ధితి నెలకొన్నది.
దీనిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం జిల్లా సంయుక్త కలెక్టర్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ విలువల తీరుపై రెండున్నర నెలల నుంచి రిజిస్ట్రేషన్, స్టాంపులశాఖ కసరత్తు చేస్తోంది. కనిష్ఠంగా 10% నుంచి గరిష్టంగా 20% వరకు రిజిస్ట్రేషన్ విలువలు పెంచే అవకాశం ఉంది.
ఆస్తుల క్రయ,విక్రయాల రిజిస్ట్రేషన్ విలువలను వచ్చే డిసెంబరు 1 నుంచి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయం గా నిర్ణయించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదంతో అధికారిక ప్రకటన రానుందని అధికారులు చెప్పారు