తెలుగు సాహిత్య శిఖరం మొల్ల.. : డీఆర్వో నరసింహులు
TIRUPATI DRO NARASIMHULU
తెలుగు సాహితీ వనంలో తొలి ధ్రువతార, మహాకవయిత్రి మొల్ల జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) నరసింహులు పాల్గొని మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషా సాహిత్యాలకు మొల్ల చేసిన కృషి అనన్య సామాన్యమని కొనియాడారు. మహిళలు చదువుకు దూరంగా ఉన్న కాలంలోనే ఆమె గొప్ప సాహిత్యాన్ని సృష్టించి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.
MollaJayanthi #TeluguLiterature #PoetessMolla #WomenPower #TeluguCulture #LiteraryLegend #AndhraPradesh #MollaRamayanam

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
