- పాహల్గాం దాడిలో హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని ఓదార్చిన ప్రధాని
కాన్పూర్:“ఆ తండ్రి భుజాన్ని తడిమాడు… ఆ భార్య కన్నీళ్లకు తోడుగా నిలిచాడు… కేవలం ప్రధాని కాకుండా దేశం అంతటిని అద్దం పట్టించాడు!” పాహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది కుటుంబాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కాన్పూర్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగంతో కుటుంబాన్ని ఓదార్చారు.
ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుంది – మోదీ హామీ
శుభం భార్య వివరించిన ప్రకారం, ప్రధాని మోదీ అన్నారు – “ఉగ్రవాదంతో యుద్ధం దీర్ఘకాలం సాగుతుంది. ఇది ఆగదు. మీరు ఒంటరి కారు… దేశమంతా మీతో ఉంది.” ప్రధానిని చూసిన ప్రతిక్షణం మానవీయతే కనిపించిందని ఆమె చెబుతున్నారు.
“మతపరమైన విభజన ఉగ్రవాద లక్ష్యం” – బాధితురాలి ఆవేదన
“వారు మా మతం అడిగారు, హిందువులనే లక్ష్యంగా చేసుకున్నారు. మతపరంగా దేశాన్ని చీల్చాలనే కుట్ర సాగుతోంది” అని బాధితురాలు ప్రధానికి వివరించారు. దీనిపై మోదీ జాగ్రత్తగా స్పందించారని, భవిష్యత్తులో మళ్లీ కలుసుకుని ఈ విషయంలో మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.
ఫిబ్రవరి 12న పెళ్లి… ఏప్రిల్ 22న ఉగ్రదాడిలో మృతి
పెళ్లైన రెండు నెలలకే… శుభం ద్వివేది తన భార్య, మరదలితో కలిసి పాహల్గాం పర్యటనకు వెళ్లిన సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. శుభం తలపై తూటా తగిలి అక్కడికక్కడే మరణించాడు. మొత్తం 26 మంది ఈ దాడిలో మరణించారు. వీరిలో నేపాల్ పౌరుడు కూడా ఉన్నారు.
“మన కొడుకు దేశం కోసం బలయ్యాడు” – కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
“శుభంను అధికారికంగా వీరమరణం పొందిన వ్యక్తిగా గుర్తించాలి” అని కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. “అతడు కేవలం పర్యాటకుడిగా కాదూ… హిందువుగా టార్గెట్ అయ్యాడు. మేము బాధపడుతున్నాం, కానీ అతడి త్యాగాన్ని దేశం గుర్తించాలి” అని వారు కోరుతున్నారు.
ఎంపీ కోరగానే ప్రధాని స్పందన
కాన్పూర్ ఎంపీ రమేష్ అవస్తి ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించడంతో ఈ సమావేశం సాధ్యమైంది. దేశం మొత్తం ఉగ్రవాదంతో యుద్ధం చేస్తున్న వేళ, మోదీ తరహాలోని మానవతా స్పందన చాలా మందికి ధైర్యాన్నిస్తుంది.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.