
అమరావతి, జూన్ 08 : రాజధాని (Capital) అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. జర్నలిస్టు (Journalist) ముసుగులో ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేయడం ఒక వ్యవస్థీకృత కుట్రలో భాగమేనని ఆయన అన్నారు.
అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతుల్లో 32 శాతం ఎస్సీ, ఎస్టీ, 14 శాతం బీసీ రైతులు ఉన్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. రాజధానిపై కుట్రలకు పాల్పడితే, అలాంటి వారిపై పోలీసు శాఖ నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ ఖండించారు. జర్నలిస్టు ముసుగులో కుట్ర జరుగుతోందని, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.