
హఫీజ్ సయీద్ మాటలే ప్రతిధ్వనించాడా?
పాకిస్తాన్ మరోమారు మాటలతో రెచ్చిపోయింది, కారుకూతలు కూస్తూ భారతదేశాన్ని రెచ్చగొడుతోంది. ఆ దేశ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) 22వ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి, భారతదేశంపై కారుకూతులు కూశాడు. అతనో కరుడు కట్టిన ఉగ్రవాదిలా, మరో ఉగ్రవాది చేసిన కారుకూతలను వల్లేవేశాడు.
భారతదేశం ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి, ప్రపంచ సమాఖ్య ఎదుట పాక్‌ను ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చే దేశంగా బహిర్గతం చేసి తాము ఎందుకు దాడి చేశామో ప్రపంచదేశాలకు భారత ప్రతినిధులు చెపుతున్న సమయంలో పాకిస్తాన్‌లో ఏర్పాటైన సభలో షరీఫ్ చౌదరి మాట్లాడుతూ, “మీరు మా నీటిని అడ్డుకుంటే, మేము మీ ఊపిరిని నిలిపేస్తాం ” అని ఆయన అన్నారు. సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ గతంలో చేసిన ప్రసంగానికి మరోమారు చెప్పినట్టుండటంతో, చౌదరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న పాత వీడియోలో హఫీజ్ సయీద్ కూడా ఇదే మాటలతో భారత్‌ను బెదిరిస్తూ మాట్లాడటం కనిపిస్తోంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాదుల మద్దతుగా మాట్లాడడమే అని విశ్లేషకులు చెబుతున్నారు.
చౌదరి చరిత్రను తిరగేస్తే, ఆయన తండ్రికి ఓసామా బిన్ లాడెన్‌తో ఉన్న సంబంధాలపై గతంలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. 9/11 ఉగ్రదాడుల తర్వాత ఒసామా బిన్ లాడెన్ ప్రపంచ ఉగ్రవాద నిఘా సంస్థల ప్రధాన లక్ష్యంగా మారిన విషయం తెలిసిందే.
భారత ప్రభుత్వ వర్గాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించనున్నాయని సమాచారం. ఇప్పటికే పాకిస్తాన్ పై ప్రపంచానికి తగిన ధృవాలను అందజేస్తూ భారత్ దౌత్య పరంగా ముమ్మరంగా లాబీ చేస్తున్నది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ నేతలను ఈ వ్యాఖ్యలే సాక్ష్యం చెబుతున్నాయని విశ్లేషకుల అభిప్రాయం.