March 10, 2026

ఎన్టీఆర్ వారసుడు ఎవరు? లోకేశ్ వల్లే పార్టీకి నష్టం: బివి రామ్

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు నిజమైన వారసుడు ఎవరు? జూనియర్ ఎన్టీఆరా లేదా నారా లోకేశా అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ప్రశ్నించారు. “లోకేశ్ వల్లే పార్టీ నాశనమవుతోంది” అంటూ మంత్రి పదవి నుంచి ఆయనను తొలగించాలనే డిమాండ్ చేశారు.

సోమవారం హోటల్ మేఘాలయలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బివి రామ్ మాట్లాడుతూ, “ప్రజలు విశ్వాసంతో గెలిపించిన TDP, Jana Sena, BJP కూటమి పట్ల  విమర్శలు వస్తున్నాయి” అన్నారు. “ప్రభుత్వ పరిపాలనపై dissatisfaction అన్ని జిల్లాల్లో ఉంది” అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలే ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తిని సూచిస్తున్నాయని అన్నారు.

60-70 మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పేంత పరిస్థితి ఏర్పడిందని, ఇందుకు ప్రధాన కారణం నారా లోకేశ్ అని రామ్ మండిపడ్డారు. “ఎన్టీఆర్ ఏర్పాటుచేసిన పార్టీని ఇప్పుడు అధ్వానంగా నడిపిస్తున్నారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ భావజాలానికి ఇది అవమానం,” అని అన్నారు.

అమరావతిలో మళ్లీ భూముల సేకరణపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చిన తరుణంలో మళ్లీ 40,000 ఎకరాలు (acres) అవసరమంటూ రైతులపై ఒత్తిడి తగదు అన్నారు. రైతులు భూములు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని పర్యటనకు విశాఖ పోలీసులు భద్రత కల్పించగలరా? అని రామ్ ప్రశ్నించారు. అదే సమయంలో పార్టీపై తిరుగుబాటు చేస్తున్న కార్యకర్తల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *