వేసవి వినోదానికి 'నేను రెడీ'
హవీష్ – త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సమ్మర్ స్పెషల్‌గా విడుదల!
వినోదాల హంగామాకు రంగం సిద్ధం
యంగ్ హీరో హవీష్, మాస్ సినిమాల స్పెషలిస్ట్ త్రినాథరావు నక్కిన కలయికలో రూపొందుతున్న చిత్రం ‘నేను రెడీ’. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ థియేటర్లలో ప్రదర్శితమై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా (Summer Special) విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఒక సాదాసీదా మధ్యతరగతి యువకుడు తన ఇంటిని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి పడే తపనను దర్శకుడు త్రినాథరావు నక్కిన తన మార్క్ కామెడీతో మలిచారు. ముఖ్యంగా ఆంధ్ర అబ్బాయికి, తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే వివాహం, ఆ తర్వాత రెండు కుటుంబాల మధ్య తలెత్తే సరదా ఘర్షణలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
నవ్వుల విందు కోసం భారీ తారాగణం
ఈ చిత్రంలో హవీష్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. ఆమె తెలంగాణ అమ్మాయి పాత్రలో తన నటనతో ఆకట్టుకోబోతోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మరియు హాస్య సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని టీజర్ ద్వారా స్పష్టమైంది. ఈ సినిమాలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, శ్రీలక్ష్మి, వి.టి.వి గణేష్ వంటి దిగ్గజ కమెడియన్లు ఉండటం విశేషం. దర్శకుడు గతంలో అందించిన ‘ధమాకా’, ‘నేను లోకల్’ తరహాలోనే ఇది కూడా నాన్‌స్టాప్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోంది.
హర్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి పతాకంపై నిఖిల కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, నిక్కీ మరియు త్రినాథరావు కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో పాటలపై భారీ అంచనాలు ఉన్నాయి. విక్రాంత్ శ్రీనివాస్ కథ, మాటలు అందించగా, నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ ఇస్తోంది.
సమ్మర్ బాక్సాఫీస్ రేసులో హవీష్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకుని, పాండిచ్చేరిలో పాటల చిత్రీకరణ కూడా ముగించుకుంది. సమ్మర్ సెలవుల సమయంలో కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. హవీష్ కెరీర్‌లో ఇదొక బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అవుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
#NenuReady #Havish #TrinadhaRaoNakkina #Summer2026 #TollywoodUpdates
