ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవం
- మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరిగే కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం పలికారు. ఈ మేరకు ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు కుంభాభిషేక మహోత్సవం జరగనుంది. 8వ తేదీన అభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కే శీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
#NaraLokesh #Indrakeeladri #KanakaDurgaTemple #Vijayawada #Kumbhabhishekam #APGovernment #SpiritualIndia #TempleNews
