ముంబై, జూన్ 9: ముంబైలో (Mumbai) ఈ ఉదయం ఘోర రైలు ప్రమాదం (train accident) జరిగింది. లోకల్ ట్రైన్ (local train) నుండి కింద పడి ఐదుగురు ప్రయాణికులు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్’ (Chhatrapati Shivaji Maharaj Terminus) నుండి థానేలోని (Thane) కసరా ఏరియాకు (Kasara Area) బయలుదేరిన రైలులో ఈ ప్రమాదం జరిగింది. అందుతున్న సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.
సాధారణంగా ముంబయి అంటూనే ఉరుకులు పరుగుల జీవితం. రైళ్ళ పట్టుకుని ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్ళేవారు, కాలేజీలకు వెళ్ళే వారు ఉదయం లేచిందే రైల్వే స్టేషన్లకు పరుగెడతారు. ఎప్పుడు చూసిన రైళ్ళు క్రిక్కిరిసిపోతుంటాయి. సోమవారం ఉదయం కూడా ప్రమాదం జరిగిన రైలు ప్రయాణికులతో నిండిపోయింది. ఫుట్ బోర్డు ప్రయాణీలు ఇక్కడ సర్వ సాధారణంగా కనిపిస్తాయి. ఇందులో భాగంగా కొంతమంది ప్రయాణికులు రైలు డోర్ల దగ్గర వేలాడుతూ ప్రయాణం చేశారు.
అయితే రైలులోంచి తోపులాట ప్రారంభమయ్యింది. చివరకు ఆ ఒత్తిడి ఫుట్ బోర్డు మీద ప్రయాణిస్తున్న వారిపై పడింది. ప్రయాణికుల అధిక రద్దీ (overcrowding) కారణంగా తోపులాటతో డోర్ దగ్గర ఉన్న 10 నుంచి 12 మంది ప్రయాణికులు కదులుతున్న రైలు నుంచి కింద పడిపోయారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అధికారులు (railway officials) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి (hospital) తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు (investigation) ప్రారంభించారు. తోపులాట కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.