ఉలాన్ బాటర్, జూన్ 3: వేసవి సెలవుల్లో కొడుకు తీసుకున్న విలాసవంతమైన, ఫోటోలు బయటపడిన నేపథ్యంలో మంగోలియా ప్రధాని లూవ్సన్నమ్స్రైన్ ఒయున్-ఎర్డెనె రాజీనామా చేశారు. ఈ ఫోటోలు social mediaలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా protests చెలరేగాయి.
luxury holiday, Dior bag, swimming pool photoలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, ప్రధాని కుమారుడు, అతని ప్రేయసి ఖరీదైన షాపింగ్ బ్యాగులతో ఉన్న దృశ్యాలు ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఒక ఫోటోలో “Happy birthday to me” అంటూ క్యాప్షన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో anti-corruption agency దర్యాప్తును ప్రారంభించింది.
ప్రధాని కుటుంబం ఖరీదైన జీవనశైలిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తోంది? అని ప్రజలు ప్రశ్నించగా, Ulaanbaatar protestsలో వేలాది మంది ముఖ్యంగా యువత రోడ్డెక్కారు. రెండు వారాలుగా కొనసాగిన నిరసనలతో ఒయున్-ఎర్డెనెపై ఒత్తిడి పెరిగింది.
Parliament trust voteలో ఆయనకు తక్కువ మంది నుంచి మద్దతు లభించింది. 126 మంది సభ్యుల్లో 88 మంది ఓటేసినప్పుడు, 44 మంది మాత్రమే ఆయనకు మద్దతుగా నిలిచారు. 64 ఓట్లు అవసరమైనప్పటికీ ఆయన్ను 38 మంది వ్యతిరేకించారు.
ఓటింగ్ అనంతరం ఓయున్-ఎర్డెనె మాట్లాడుతూ, “కష్టకాలాల్లో నా దేశం, ప్రజలకు సేవ చేయడం గర్వకారణం,” అన్నారు. తాను ఎటువంటి తప్పూ చేయలేదని, ఇది రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అని స్పష్టం చేశారు. “నా ఖ్యాతిని దెబ్బతీయడానికి smear campaign నడుపుతున్నారు,” అన్నారు.
Transparency International నివేదిక ప్రకారం, మంగోలియా దేశంలో అవినీతి పరిస్థితి ఒయున్-ఎర్డెనె ప్రధానిగా పదవిలోకి వచ్చిన తర్వాత మరింత దిగజారిందని వెల్లడించింది.
రష్యా, చైనా మధ్యలో ఉన్న మంగోలియా, 1990ల నుంచే democracy strengthening పనిలో నిమగ్నమై ఉంది. Third Neighbour Policy ద్వారా పాశ్చాత్య దేశాలతో సంబంధాలను మెరుగుపరచాలని చూస్తోంది.
ఇంకా ఓ ప్రత్యేక కేసులో, అమెరికాలోని US prosecutors మునుపటి ప్రధాని Sukhbaatar Batboldపై న్యూయార్క్‌లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు మైనింగ్ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అయితే ఆయన వాటిని ఖండించారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.