భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద నందమూరి తారక రామారావు (NTR) విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.
గత వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసిందని, ఇప్పుడు కల్తీ నెయ్యి విషయంలో నిజాలు బయటపడుతుంటే తప్పుడు ప్రచారాలతో బుకాయించాలని చూస్తోందని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చే సాంప్రదాయాన్ని కూడా విస్మరించారని గుర్తు చేశారు. 70 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టి, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్ రెడ్డిదేనని ఎద్దేవా చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానాయకుడు ఎన్టీఆర్ అని, నేటికీ అనేక సంక్షేమ పథకాలకు ఆయన సిద్ధాంతాలే పునాదులని కొనియాడారు.
మంత్రి గొట్టిపాటి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాజధాని పనులను ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలిపారు. పెన్షన్ల పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి హామీలను నిబద్ధతతో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రైతాంగానికి, ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ఇంధన శాఖ పనిచేస్తోందని హామీ ఇచ్చారు.
#GottipatiRaviKumar #Bhimavaram #TDP #AndhraPradeshPolitics #NTRStatue #TirumalaGheeCase #YSRCPvsTDP
