హెచ్1బీ, హెచ్4 వీసా అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ అవుతుండటం, వీసా స్టాంపింగ్ ఆలస్యం కావడం నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఉద్యోగులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది.
వీసా అపాయింట్మెంట్లు తరచూ రీషెడ్యూల్ అవుతున్న నేపథ్యంలో, వేరే దేశాల్లో ఉన్న తమ ఉద్యోగులు వీసా గడువు ఇంకా మిగిలి ఉంటే అది ముగిసేలోగానే అమెరికాకు వచ్చేయాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. అపాయింట్మెంట్ రీషెడ్యూల్ అయిన వారు తమ ప్రయాణ ప్రణాళికలను వెంటనే మార్చుకోవాలని తెలిపింది. ఈ సూచనలు (Microsoft advisory)గా ఉద్యోగులకు పంపినట్లు సమాచారం.
డిసెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చిన ‘ఆన్లైన్ ప్రెజెన్స్ రివ్యూ’ అంటే సోషల్ మీడియా తనిఖీ కారణంగా, హెచ్1బీ, హెచ్4 వీసాల రోజువారీ ప్రాసెసింగ్ సామర్థ్యం గణనీయంగా తగ్గిందని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. దీని వల్ల వీసా స్టాంపింగ్ ఆలస్యం కావడం, అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ కావడం జరుగుతున్నాయని సంస్థ స్పష్టం చేసింది. ఈ పరిణామాలు (H1B visa), (H4 visa) దారుల్లో ఆందోళన పెంచుతున్నాయి.
భారత్లో ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్ కాన్సులేట్లలో రీషెడ్యూలింగ్ నోటిఫికేషన్లు ఎక్కువగా జారీ అవుతున్నాయని, కొత్త అపాయింట్మెంట్ తేదీలు 2026 జూన్ వరకు వెళ్లాయని మైక్రోసాఫ్ట్ అసోసియేట్ జనరల్ కౌన్సెల్ ఫర్ ఇమ్మిగ్రేషన్ జాక్ చెన్ తెలిపారు. కొంతమంది ఉద్యోగులు కాన్సులేట్‌కు చేరుకున్న తర్వాతే తమ అపాయింట్మెంట్ రీషెడ్యూల్ అయినట్టు తెలుసుకున్నారని, మరికొందరికి ప్రయాణానికి ముందే నోటీసులు అందాయని ఆయన వెల్లడించారు.
వీసా స్టాంపింగ్ అవసరమైన ఉద్యోగులు, హెచ్1బీ వీసా అపాయింట్మెంట్ రీషెడ్యూల్ అయిన వారి విషయంలో తామే ప్రత్యక్షంగా సంప్రదిస్తామని మైక్రోసాఫ్ట్ తన అడ్వైజరీలో పేర్కొంది. అపాయింట్మెంట్ రీషెడ్యూల్ అయినప్పటికీ, ప్రస్తుత వీసాకు ఇంకా గడువు మిగిలి ఉంటే అది ముగియక ముందే తిరిగి అమెరికాకు రావాలని సూచించింది. కొత్త వీసా అవసరమై, అపాయింట్మెంట్ కొన్ని నెలల తర్వాతకు వెళ్తే, ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని (US visa stamping delay) నేపథ్యంలో స్పష్టం చేసింది.
#H1BVisa
#H4Visa
#MicrosoftAdvisory
#VisaDelay
#USImmigration