వికెట్ కీపింగ్‌లో ఆస్ట్రేలియా జట్టుకు సిమెంట్ వాల్లా నిలబడిన క్రికెటర్ మాథ్యూ వేడ్(Matthew Wade) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. 2021 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడతను.
తాను కెరీర్లో అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించాడు. తాను అంర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించాడు. కానీ తన దేశం కోసం ఆడాలనుకునే వారిని తీర్చిదిద్దడానికి కోచింగ్ బాధ్యతలను మాత్రం తీసుకోనున్నట్లు వివరించాడు. 36 ఏళ్ల మాథ్యూ వేడ్ ఆస్ట్రేలియా తరపున 36 టెస్టులు, 97 వన్డేలు, 92 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
అయితే టాస్మానియా, బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ తరపున దేశవాళీ క్రికెట్లో ఆడతానని చెప్పాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో మాథ్యూ వేడ్ చివరిసారి ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.
కోచింగ్ గురించి చాన్నాళ్లుగా ఆలోచిస్తున్నట్లు వేడ్ తెలిపాడు. క్రికెట్ ఆస్ట్రేలియా తన ఎక్స్ ఖాతాలో వేడ్ రిటైర్మెంట్ ప్రకటన రిలీజ్ చేసింది.