బ్లాక్ అవుట్ సమాచారాన్ని శత్రువులకు అందించిన జ్యోతి మల్హోత్రా
పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి మల్హోత్రాను ఎన్ఐఏ విచారిస్తుంటే, విస్తుబోయే నిజాలు బయటికి వస్తున్నాయి. తన మాటలతో హొయలతో ఆడియన్స్ ఆకట్టుకున్న జ్యోతి మల్హోత్రా అంతే ప్రమాదకారి అని తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. లక్షల మంది ఆమెకు యూట్యూబ్ ఫాలోయర్లుగా ఉన్నారు. ఆమెము శత్రు దేశమైన పాకిస్తాన్‌కు కోడలు కావాలని తహతహలాడుతోంది. వారి వలలో పడి దేశానికి సంబంధించిన భద్రత సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ చెవిలో వేసేది. పకల్గావ్ ఘటన తర్వాత భారత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి అడ్డంగా దొరికిపోయింది.
ఆమెతో పాటు 11 మందిని ఎమ్మెల్యే అరెస్టు చేసింది. విచారణ చేస్తుంటే దిమ్మతిరిగే నిజాలు బయట పడుతున్నాయి.
ఆపరేషన్ సింధూర సమయంలో దేశమంతా కూడా రోమాలు నిక్కబడుచుకుని ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని భయపడుతూ ఉంటే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మాత్రం, భారతదేశం విధించిన బ్లాక్అవుట్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్ తో పంచుకున్నట్లు విచారణలో తేలుతోంది.
అంతేకాదు పహల్ గావ్ ఘటన కంటే ముందు ఆ ప్రాంతంలో ఆయన పర్యటించినట్లు కూడా తెలుస్తోంది. ISI హ్యాండ్లర్‌తో కోడెడ్ చాట్లతో ఆమె సమాచారాన్ని వారితో పంచుకుంది. చాటింగ్‌లో ‘నన్ను పాకిస్తాన్లో వివాహం చేసుకోండి’ అని కూడా చెప్పింది.
‘Travel with JO’ అనే యూట్యూబ్ ఛానెల్‌ను నడిపిన హర్యానాకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (PIOలు)తో సంబంధాలపై తీవ్రమైన గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు అయ్యింది. ఉత్తర భారతదేశంలో పనిచేస్తున్నట్లు భావిస్తున్న పాకిస్తాన్ మద్దతుగల గూఢచారి నెట్‌వర్క్‌కు సంబంధించి గత రెండు వారాలుగా పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్‌లలో NIA 11 మందిని అరెస్టు చేసింది. వాటిలో జ్యోతి మల్హోత్రా ఒక్కరు.
4,00,000 మందికి పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న జ్యోతి మల్హోత్రాను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లు విచారిస్తున్నాయి.

Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.