March 27, 2026

సుక్మాలో మావోయిస్టుల దాడి: ఏఎస్పీ ఆకాశ్‌రావు మృతి

సుక్మా జిల్లాలో మావోయిస్టులు మరోసారి పోలీసులపూ దాడికి పాల్పడ్డారు. కొంట – గొల్లపల్లి రోడ్డులో ఐఇడీ బాంబ్ (IED bomb) పేల్చి అదనపు ఎఎస్‌పీ ఆకాశ్‌రావు గిర్పుంజేను మావోయిస్టులు హతమార్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్ (base camp) సమీపంలో ఈ పేలుడు జరగగా, భద్రతా దళాలు హుటాహుటిన స్పందించాయి. ఘటనాస్థలంలో తీవ్ర గాయాలపాలైన ఆకాశ్‌రావును ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.

ఈ దాడికి ముందు కొంటా చిక్వార్‌గూడ మైన్‌లో మావోయిస్టులు ప్రొక్లెయిన్‌కు నిప్పు పెట్టారు. విచారణకు అక్కడికి చేరుకున్న ఏఎస్పీ వాహనంపై మావోయిస్టులు మాటు వేసి ఐఇడీతో దాడి చేశారు. ఈ సంఘటన భద్రతా వ్యవస్థపై మళ్లీ ప్రశ్నలు ఎత్తుతోంది. పోలీసులు పరిసరాల్లో భారీగా గాలింపు చర్యలు ప్రారంభించారు.

మరోవైపు, ఐదు రోజుల క్రితం చత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల అగ్రనేత సుధాకర్ మృతిచెందారు. ఆయన స్వస్థలం ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు కావడంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. స్థానిక ప్రజలు, బంధువులు, మావోయిస్టు సానుభూతిపరులు సుధాకర్‌కు నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలు సోదరుడు అనందరావు నిర్వహించారు. మావోయిస్టు అనుచరుల రాకతో గ్రామం మొత్తం పోలీసుల నిఘా (surveillance)లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *