March 10, 2026

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కిరణ్ అబ్బవరం

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు కిరణ్ అబ్బవరంకు దర్శన ఏర్పాట్లు చేశారు.

ఉదయం దర్శనం చేసుకున్న తరువాత కిరణ్‌కు ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతర ఆయన ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, తాజాగా తాను నటించిన మూవీ సూపర్ హిట్ కావాలని శ్రీవారిని కోరుకున్నానని కిరణ్ అబ్బవరం తెలిపాడు.

కిరణ్ అబ్బవరంతో పలువురు భక్తులు ఫొటోలు, సెల్పీలు దిగేందుకు ఎగబడ్డారు. ఆయన కూడా అడిగిన వారందరితో ఫొటోలకు,సెల్ఫీలకు దిగాడు.

ఈయన నటించిన వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు విడుదల కాగా, వినరో భాగ్యము విష్ణు కథ ఒక్కటే ఓ మోస్తరుగా నిలిచింది.

తరువాత ఆయన పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సినిమాలో కిరణ్ అబ్బవరం పోస్ట్ మ్యాన్‌గా కనిపించనున్నాడు. కిరణ్ సరసన నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు సుజీత్, సందీప్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *