March 24, 2026

” డాడీ, చిన్న మోడీ, పెద్ద మోడీలే రాజకీయ టార్గెట్ “: కవిత కీలక ప్రకటన!

Kavitha

తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కవిత ప్రధాన ప్రకటన చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. త్వరలోనే ఆమె ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు సమాచారం ఉంది. ఇలాంటి తరుణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

తన రాజకీయ పోరాటం ” కేసీఆర్(డాడీ), రేంత్ రెడ్డి( చిన్నమోడీ), పెద్దమోడీ(ప్రధాని మోడీ)లపైనే ఉంటుందని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తీహార్ జైలు నుండి విడుదలైన తర్వాత ఆమె తన తండ్రి కేసీఆర్‌, కేటీఆర్‌లను వ్యతిరేకించడం మొదలు పెట్టిని విషయం తెలిసిందే. దీంతో ఆమె బీఆర్ ఎస్ రాజకీయ ప్రత్యర్థుల జాబితాలో చేరిపోయారు.

రేవంత్ రెడ్డి తనను తక్కువగా అంచనా వేస్తున్నారని, భవిష్యత్తులో తెలంగాణ ముఖ్యమంత్రిని అవుతాననే ధీమాను ఆమె వ్యక్తం చేశారు. కేసీఆర్ ఫోటో లేకుండానే ఎన్నికలకు వెళ్తానని ఆమె చెప్పడం బీఆర్ఎస్ పార్టీతో ఆమెకు ఉన్న విభేదాలను స్పష్టం చేస్తోంది.

Read this article also: తెలంగాణ అసెంబ్లీలో హైవోల్టేజ్ డ్రామా: రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్.. ఆరు గ్యారంటీలే టార్గెట్‌గా మాటల యుద్ధం!

పార్టీలోగో ధర్మగంట

తన కొత్త పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అని నామకరణం చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ లోగోగా “ధర్మ గంట”ను ఎంచుకున్నట్లు సమాచారం. శ్రీరామనవమి పర్వదినం నాడు ఒక శుభ ముహూర్తాన తన కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఆమె సూచనప్రాయంగా తెలిపారు.

ప్రస్తుతం తాను గాంధీజీ ప్రవచించిన ‘సర్వోదయ’ సూత్రాలను అధ్యయనం చేస్తున్నానని, పార్టీ ఎజెండాను ప్రారంభోత్సవం రోజే వెల్లడిస్తానని కవిత చెప్పారు.

English Summary:

In a major political move, MLC Kavitha hinted at launching her new party, “Telangana Praja Jagruthi,” on the occasion of Sri Rama Navami. Speaking on Ugadi, she stated her fight is against “Daddy (KCR), Modi, and Chinna Modi (Revanth Reddy).” She reportedly chose “Dharma Ganta” as her party symbol and is currently studying the ‘Sarvodaya’ principles of Mahatma Gandhi. Her aggressive stance against both the BRS leadership and the current Congress government has sparked intense debate in Telangana politics.

Kavitha #TelanganaPolitics #NewParty #BRS #Congress #RevanthReddy #KCR #AndhraPulse #BreakingNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *