- అక్రమ వలసదారుల తనిఖీలపై చెలరేగిన నిరసనలు
- లైవ్ కవరేజ్‌లో ఉన్న జర్నలిస్టుపై కాల్పులు
లాస్ ఏంజిల్స్, జూన్ 11: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో అక్రమ వలసదారులపై federal raids తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ తనిఖీలకు స్థానికులతో పాటు డెమోక్రటిక్ మద్దతుదారులు, విదేశీయులు మద్దతు తెలపడంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు పోలీసులపై దాడి చేయడంతో గొడవలు చోటుచేసుకున్నాయి. పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్‌తో నిరసనలు నియంత్రించేందుకు యత్నించారు.
ఈ ఉద్వేగభరితమైన వాతావరణంలో media coverage అందిస్తున్న నైన్ న్యూస్ ఆస్ట్రేలియా జర్నలిస్టు Lauren Tomasi తీవ్ర అనుభవానికి గురయ్యారు. ఆమె లైవ్‌లో ఉండగానే ఒక పోలీస్ అధికారి ఆమె కాలిపై రబ్బరు బుల్లెట్ కాల్చాడు. గాయపడినప్పటికీ ఆమె లైవ్ బ్రాడ్‌కాస్ట్ కొనసాగించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారాయి. వీటిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటనపై ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే ఈ చర్యను ఖండించింది. “Press freedom is non-negotiable. Journalists must be protected in conflict zones,” అంటూ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. మీడియా స్వేచ్ఛను హరించే చర్యలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచే విధంగా ఉంటాయని పేర్కొంది.
లాస్ ఏంజిల్స్‌లోని ఈ నిరసనలకు కారణం అమెరికా ప్రభుత్వం చేపట్టిన అక్రమ వలసదారులపై ఆకస్మిక దాడులే. ఫెడరల్ అధికారులు చేపట్టిన ఈ తనిఖీలను స్థానికులు, వలసదారుల మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. వారిలో కొందరు మోతాదుకు మించి వెళ్లడంతో పోలీసు యంత్రాంగం తక్షణం శాంతి భద్రతలు నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంది. అయితే అందులో పాత్రికేయులను కూడా టార్గెట్ కావడం తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
U.S. Correspondent Lauren Tomasi has been caught in the crossfire as the LAPD fired rubber bullets at protesters in the heart of Los Angeles. #9News
LATEST: https://t.co/l5w7JxixxB pic.twitter.com/nvQ7m9TGLj
— 9News Australia (@9NewsAUS) June 9, 2025
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.