
- పోలీసులపై మండిపడ్డ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
ఎవరినైనా అరెస్టు చేస్తే ఎక్కడ ఉంచారో.. ఎక్కడికి తీసుకెళ్ళుతున్నారో… తెలపాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని వైఎస్సార్సీపీ ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదర్ రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్టు చేసి ఆయనను ఎక్కడి తరలించారో, ఎక్కడ ఉంచారో కనీస సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.
ఎవరో ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. ఆదివారం కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేశామని పోలీసు ధృవీకరించారు. మధ్యాహ్నం 2:00 గంటలకు గోవర్ధన్ రెడ్డి అరెస్టు చేస్తే ఎక్కడ ఉంచారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అన్న కనీస సమాచారం కూడా లేకుండా గోప్యంగా ఉంచడం చట్ట విరుద్ధమని మండపడ్డారు. మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు కనీస సమాచారం ఇవ్వాలన్న బాధ్యత పోలీసు శాఖపై లేకపోవడం బాధ్యత రాహిత్యమేనని తెలిపారు.
ఈ రాష్ట్రంలో ఎప్పుడూ ఈ విధంగా అక్రమ కేసులు నమోదు చేయడం జరగలేదని, గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని, ఇది మంచి పద్ధతి కాదని దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు హెచ్చరించారు.
కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిపై పెట్టిన అక్రమ కేసు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధంగా పోరాటం చేస్తుందన్నారు. ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు క్లీన్ చిట్‌తో బయటికి వస్తారని నమ్మకం తమకుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలుస్తుందని చెప్పారు.
అధికార పార్టీ ఇచ్చిన హామీలను అమలును ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారన్న ఒకే ఒక్క కారణంతో వారిపై అక్రమ కేసులు పెట్టి ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇది అప్రజాస్వామ్యకం అని దర్శి MLA ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు.