పొటాటో రోజూ తింటే ఆరోగ్యకరమైనా?!
పొటాటో అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా పిల్లలు పొటాటోతో చేసిన ఏ వంటకమైనా ఎంతో ఇష్టంగా తింటారు. పెద్దవాళ్లు కూడా సలాడ్‌లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇతర వంటకాల రూపంలో బంగాళదుంపను రోజూ తీసుకుంటుంటారు. అయితే (Daily Potato Consumption) రోజూ పొటాటో తినడం ఆరోగ్యానికి మంచిదా? లేదా అనారోగ్య సమస్యలకు కారణమవుతుందా? అనే అంశంపై వైద్యులు, పోషకాహార నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.
వైద్యుల ప్రకారం పొటాటోలో (Potato Nutrition Benefits) ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
అయితే బంగాళదుంపలను నూనెలో డీప్ ఫ్రై చేసుకుని తినడం కంటే ఉడకబెట్టుకుని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. నూనెలో వేయించిన పొటాటో తీసుకుంటే శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉండటంతో గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
నీరసం, అలసటగా ఉన్న సమయంలో ఉడకబెట్టిన బంగాళదుంపలను తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే పొటాటో మెదడు, ఎముకల ఆరోగ్యానికి కూడా ఉపయోగకరమని పేర్కొంటున్నారు. అయితే (Potato and Diabetes) మధుమేహం ఉన్నవారు మాత్రం బంగాళదుంపలను వైద్యుల సలహా మేరకే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
#PotatoBenefits
#HealthyEating
#NutritionTips
#DailyDiet
#FoodAndHealth