- వారసుడు ఎవరు?
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (85) తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయల్ తో యుద్ధ సమయంలో ఈ వార్త ఇరాన్ వాసులను కలచి వేస్తోంది. ఒకవైపు అధ్యక్షుడి ఆరోగ్యంపై ఆందోళన చెందుతూనే ఆయన వారసుడు ఎవరన్న దానిపై చర్చ మొదలైంది.
గడ్డు పరిస్థితులలో ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ (55) తదుపరి సుప్రీం లీడర్ గా ఉండవచ్చునని తెలుస్తోంది.ఖమేనీ 1989 నుంచి సుప్రీం లీడర్‌గా ఉన్నారు. రుహొల్లా ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. 1989లో ఇరాన్ సుప్రీం లీడర్ రుహోల్లా ఖొమేనీ మృతితో ఆయన వారసుడిగా అలీ ఖమేనీ బాధ్యతలు చేపట్టారు.
ఖమేనీ వారసుడిగా భావించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దీంతో ఖమేనీ రెండో కుమారుడు మెజ్తాబా (55) ఇరాన్ సుప్రీం నేతగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.
ఇజ్రాయేల్ ప్రతీకార దాడులకు ఎలా స్పందించాలనే దానిపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ప్రచారం మొదలైంది. దీనిపై ఇరాన్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అయితే, తాము ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేయకూడదని భావిస్తున్నట్టు ఇరాన్ అధికారులు వెల్లడించారు.
మిత్రపక్షాల శక్తి సన్నగిల్లడం, ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినడం, ఖమేనీ ఆరోగ్యం విషమించడంతో వారసుడి ఎంపిక వంటి ఇబ్బందులతో ఇరాన్ డైలామాలో ఉంది. ఈ క్రమంలో గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణను సూచిస్తూ ఇరాన్ సైన్యం శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.