అహ్మదాబాద్‌లో భారత్ వర్సెస్ నెదర్లాండ్స్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న భారత్, తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం రాత్రి జరగనున్న ఈ పోరులో నెదర్లాండ్స్‌తో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకున్నప్పటికీ, విజయ పరంపరను కొనసాగిస్తూ క్లీన్ స్వీప్‌తో తదుపరి దశకు వెళ్లాలని భారత్ భావిస్తోంది.
నరేంద్ర మోదీ స్టేడియంలో సమరానికి సై
పాకిస్థాన్‌పై భారీ విజయంతో మంచి ఊపు మీదున్న టీమిండియా, పసికూన నెదర్లాండ్స్‌పై కూడా ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తోంది. మరోవైపు, మూడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించిన డచ్ జట్టు, భారత్‌కు గట్టి పోటీ ఇచ్చి ఆశ్చర్యపరచాలని పట్టుదలతో ఉంది. అయితే, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా టీమిండియా విజయం నల్లేరుపై నడకే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
కుల్దీప్ యాదవ్‌పై వేటు.. అర్ష్‌దీప్ రీఎంట్రీ!
గత మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ, ఫీల్డింగ్‌లో అలసత్వం ప్రదర్శించిన కుల్దీప్ యాదవ్‌పై మేనేజ్‌మెంట్ కఠినంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతని ‘లేజీ’ ఫీల్డింగ్ కారణంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసహనం వ్యక్తం చేయడంతో, ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ను తప్పించి అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అహ్మదాబాద్ పిచ్ పేస్‌కు కూడా సహకరిస్తుండటం అర్ష్‌దీప్‌కు కలిసొచ్చే అంశం.
అభిషేక్ శర్మ ఫామ్‌పై ఆందోళన
విధ్వంసకర ఓపెనర్‌గా పేరున్న అభిషేక్ శర్మ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అవ్వడం టీమిండియాను కలవరపెడుతోంది. సూపర్-8 వంటి కీలక దశకు ముందు అతను ఫామ్‌లోకి రావడం అత్యవసరం. నెదర్లాండ్స్‌పై చెలరేగి ఆడి పరుగుల దాహాన్ని తీర్చుకోవాలని అభిషేక్ పట్టుదలగా ఉన్నాడు. ఒకవేళ అభిషేక్ బరిలోకి దిగితే, సంజూ శామ్సన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కావలసి ఉంటుంది.
బుమ్రాకు విశ్రాంతి.. సిరాజ్ సిద్ధం?
కీలకమైన సూపర్-8 మ్యాచ్‌ల దృష్ట్యా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చే యోచనలో జట్టు యాజమాన్యం ఉంది. బుమ్రాకు రెస్ట్ ఇస్తే మహమ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వస్తాడు. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ తమ స్థానాలను నిలబెట్టుకోనుండగా, వాషింగ్టన్ సుందర్‌కు మాత్రం నిరీక్షణ తప్పేలా లేదు.
#TeamIndia #T20WorldCup2026 #INDvNED #CricketNews #AbhishekSharma #KuldeepYadav #BleedBlue #WorldCupUpdates

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
