Misty morning at tirumala
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శని, ఆదివారాలు కావడంతో కొండపై రద్దీ రోజూకంటే అధికంగా కనిపించింది. శ్రీవారి దర్శనానికి 7 కాంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా ఆదివారం అర్థరాత్రి వరకు 76903మంది స్వామివారిని దర్శించుకున్నారు.
24612మంది భక్తులు తలనీలాలు అర్పించుకున్నారు. కానుకల రైపంలో హుండీలో రూ.3.64కోట్లు సమర్పించారు. దర్శన టికెట్లు లేని వారు స్వామి వారిని దర్శించుకోవడానికి 8గంటల సమయం పడుతోంది.