Telangana : తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా కేంద్రంలోని ఓ షాపింగ్ మాల్లో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎగసిపడుతున్న మంటలను అదుపు చేయడనికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది.
జనగామ జిల్లా కేంద్రంలోని ప్రముఖ పింగ్ మాల్లో ఆదివారం ఉదయం భారీగా మంటలు లేచాయి. బట్టల షాప్ కావడంతో మంటలు శరవేగంగా వ్యాపించాయి. వీటిని గమనించిన స్థానికులు పలువురు ఇటు పోలీసులకు, అటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేస్తున్నారు. మంటలకు గల కారణాలు ఇంకా తెలియడం లేదు.ప్రాథమిక సమాచారం మేరకు షార్ట్ సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాతే ఆస్తి నష్టం, ప్రమాదానికి ల కారణాలు తెలిసే అవకాశం ఉంది. ప్రముఖ వస్త్ర దుకాణం కావడం, అందునా దీపావళి పండుగ కావడంతో సరుకు అధికంగా ఉంటుంది కాబట్టి,ఆస్తి నష్టం భారీగా వుంటుందని భావిస్తున్నారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.