హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ పూర్తిస్థాయి డీజీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శనివారం హరీష్ కుమార్ గుప్తా పోలీస్ దళాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తా ఇంతకు ముందు విజిలెన్స్ & ఎన్ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తూ, ఇన్‌ఛార్జి డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వహించారు.
నేటి నుంచి హరీష్ కుమార్ గుప్తా డీజీపీగా రెండేళ్లపాటు కొనసాగనున్నారు. గత నాలుగు నెలలుగా ఇన్‌ఛార్జి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, పోలీసు శాఖలో ఆయన తనదైన ముద్ర వేశారు. ఈ ఏడాది జనవరిలో ద్వారకా తిరుమలరావు డీజీపీగా పదవీ విరమణ చేసిన తర్వాత, ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి హరీష్ కుమార్ గుప్తాకే ప్రభుత్వం ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది.
హరీష్ కుమార్ గుప్తా పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు సీనియర్ పోలీసు అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.