నిన్నమొన్నటి దాకా అందలమెక్కి కూర్చున్న బంగారం కాస్త తగ్గి దీపావళి వేళ పసిడి ప్రియులకు ప్రసన్నమయ్యింది. దేశీయ బులియన్ మార్కెట్‌లో బుధవారం దాకా పెరిగిన బంగారం, వెండి ధరలు.. గురువారం కాస్త తగ్గాయి.
దరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ₹550 తగ్గింది. ప్రస్తుతం ధర ₹72,850 కి దిగొచ్చింది. 24 క్యారెట్ల బంగారం ధర ₹600లకు తగ్గి.. రూ. ₹79,470 వద్ద లభిస్తోంది. దీంతో పండగలకు బంగారం కొనుగోలు చేయాలనే నమ్మకం ఉన్నవారు అప్పుడే దుకాణాలకు క్యూకడుతున్నారు.
కార్పోరేట్ దుకాణాలు కస్టమర్లతో కళకళాడిపోతున్నాయి. ఇక కిలో వెండి ధర ₹2,000 తగ్గి.. ₹1,10,000 గా కొనసాగుతుంది. వెండి లక్ష పలికిందంటేనే ఆశ్చర్యం అది 1.12 లక్షలకు చేరుకుని చివరకు రెండువేల రూపాయాలు తగ్గి తళతళా మెరిసిపోతోంది.