తిరుపతి : తిరుపతి పరిసర ప్రాంతాలలో గంజాయి అమ్మకాలు పెరిగాయి. వాటిపై తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు సీరియస్గా ఉన్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం 11-30 గంటల సమయంలో వాహనాలు తనిఖీ చేయుచుండగా, తాటితోపు రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నం చేశారు.
సిబ్బంది సహాయంతో చుట్టుముట్టి పట్టుకొని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. పట్టుబడిన వ్యక్తి తాటితోపునకు చెందిన బిసిఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి మక విషువర్ధన్ అను వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ముద్దాయిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించగా అతను నగరికి చెందిన శివ కుమార్ వద్ద కొనుక్కుని వచ్చి, తన తోటి విద్యార్థులకు ఎక్కువ రేటుకు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు.
ఈ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నాను. మరో ఇంకొక ముద్దాయి పరారీలో ఉన్నారు. అతనిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.
గంజాయి మత్తులో పడి విద్యార్థులు వారి జీవితం నాశనము చేసుకోవడమే కాక మిగత విద్యార్థులు కూడా వారి పట్ల జాగ్రత్తగా ఉండాలనీ, తల్లి తండ్రులు కూడా తమ పిల్లలను గమనిస్తూ ఉండాలని తిరుపతి రూరల్ సీఐ గోవిందు ప్రజలను కోరారు.