గతంలో బిగ్బాస్ పార్టిసిపెంట్, యూట్యూబర్ గంగవ్వకు చిలుకతో చిక్కులు వచ్చిపడ్డాయి. ఏకంగా అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. మై విలేజ్ షో కోసం గంగతవ్వ వీడియోలు చేస్తుంటుంది. అందులో భాగంగా యూట్యూబ్ ఛానల్ కోసం చిలుక జోస్యం చెబుతూ వీడియో చేసింది.
ఇదే గంగవ్వకు సమస్య తెచ్చిపెట్టింది. యూట్యూబ్ ప్రయోజనాల కోసం చిలుకను హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని వచ్చిన ఫిర్యాదు మేరకు వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ఓ పద్మారావు తెలిపారు.
గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజుపై ఈ కేసు రిజిస్టర్ అయినట్లు అధికారులు తెలిపారు. 2022 సంవత్సరం మే నెలలో తీసిన ఈ వీడియోపై జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో యూట్యూబర్ రాజు 25 వేల రూపాయలు ఫైన్ చెల్లించినట్లుగా తెలుస్తుంది.