March 27, 2026

బెల్లం కిషోర్ రెడ్డి ఇచ్చిన విందులో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు….

బెల్లం కిషోర్ రెడ్డి ఇచ్చిన విందులో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు….

రాయచోటి, మార్చి 04:చిన్నమండం మండలం నేరెళ్లవంకలో బుధవారం మధ్యాహ్నం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మల్లూరుమ్మ జాతరను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు బెల్లం కిషోర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ విందులో ముఖ్య అతిథిగా రాజంపేట పార్లమెంట్ టీడీపి అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు మరియు రాయచోటి నియోజకవర్గ సీనియర్ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు.

ఘన స్వాగతం: విందుకు విచ్చేసిన ప్రసాద్ బాబు గారికి బెల్లం కిషోర్ రెడ్డి గారు సాదరంగా ఆహ్వానం పలికారు

సందడి: జాతర సందర్భంగా జరిగిన ఈ విందులో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రసాద్ బాబు గారితో కలిసి జాతర విశేషాలను, నియోజకవర్గ అభివృద్ధి అంశాలను చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *