ముఖ్యమంత్రి తిరుపతి పర్యటనకు ముందస్తు ఏర్పాట్ల పరిశీలన
ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Andhra Pradesh Chief Minister) తిరుపతి పర్యటన (Tirupati Visit) సందర్భంగా ఆయన పర్యటించనున్న ప్రాంతాలలో చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ (Tirupati District Collector) పరిశీలించారు.
ఈ పరిశీలనలో జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు (Tirupati District SP), ఇంచార్జి జాయింట్ కలెక్టర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య (Tirupati Municipal Commissioner)తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకొని భద్రతా ఏర్పాట్లు (Security Arrangements), ట్రాఫిక్ నియంత్రణ, శుభ్రత, వేదికల ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
#ChandrababuNaidu
#TirupatiVisit
#APCM
#DistrictAdministration
#SecurityArrangements
#TirupatiNews