
తిరుపతి, జూన్ 5: డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణపై అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, వారికి కనీసం 90 రోజులు ప్రిపరేషన్ (Preparation) గడువు ఇవ్వాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (Y.S. Sharmila) డిమాండ్ చేశారు.
కేవలం 45 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించడమంటే అన్యాయమని, ఇది “మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ” అని ఆమె విమర్శించారు. లక్షల మంది అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, రేపటి నుంచే పరీక్షలు జరపడం తగదు (Not correct) అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మరో 45 రోజుల గడువు ఇవ్వాలని షర్మిల కోరారు.
మూడున్నర లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం వేచిచూస్తున్నారని, వారు పంపిన Representations పై స్పందించకపోవడం, నిరుద్యోగుల మొరను పెడచెవిన పెట్టడం ప్రభుత్వ నియంత విధానానికి నిదర్శనమని ఆమె ఆరోపించారు.
ఒక్కో అభ్యర్థికి 90 పాఠ్య పుస్తకాలు ఉన్నాయని, వాటిని 45 రోజుల్లో ఎలా చదవాలన్నదే ప్రశ్నార్థకమని ఆమె పేర్కొన్నారు. ప్రిపరేషన్ టైం అనేది న్యాయమైన హక్కు (Right) అని అభ్యర్థుల పక్షాన్ని వహించారు.
పరీక్ష విధానంపై పునరాలోచన అవసరం ఉందని షర్మిల సూచించారు. నార్మలైజేషన్ (Normalization) పేరుతో విభిన్న ప్రశ్నపత్రాలు ఇవ్వడం కాకుండా, ఒకే జిల్లా – ఒకే పేపర్ (One District – One Paper) విధానాన్ని చేపట్టాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ డిమాండ్లపై తక్షణమే పునర్విచారణ (Review) చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.