ఎల్పీజీ గ్యాస్ వినియోగ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం
ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం.
డొమెస్టిక్ వంట గ్యాస్ పెంచితే కేవలం ఇంటిపై మాత్రమే భారం పడుతుంది. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఎన్డీయే ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరపై పడింది. దీనిని పెంచడం వలన జనానికి ఏమిటి నష్టం? వారు బాగానే సంపాదిస్తున్నారు కదా.. వారి ధరలు పెరిగితే మనకేంటి? అనుకునే జనం ఉన్నారు. అలాగే అదే చెప్పే అనుకూల పార్టీల నేతలు, కార్యకర్తలు ఉన్నారు. అయితే సామాన్య జనాన్ని కేంద్రం మామూలు దెబ్బ కొట్టలేదు. నొప్పి లేకుండా దెబ్బ తెలియకుండానే బాదేసింది. ఈ పెంపు చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఏ ఏ రంగాలపై ప్రభావం పడుతుందో ఒక్కసారి చూద్దాం.
కేంద్రం ఎల్పీజీ కమర్షియల్ గ్యాసు ధరను ఏకంగా రూ. 111 పెంచేసింది. అంటే 6 శాతం పెంచింది. గతంలో హైదరాబాద్‌ను బేస్‌గా తీసుకుంటే 19 కిలోల ఎల్పీజీ గ్యాసు ధర రూ.1801 ఉండేది. అది ఇప్పుడు కనీసం రూ. 1912.50లకు పెంచేశారు. ఇక 47 కేజీల భారీ సిలిండర్ పై రూ. 276.5 పెంచేశారు. ఈ పెంపకాన్ని కంపెనీలు లేదా వ్యాపారస్తులేమి భరించరు. వారు తమ ఉత్పత్తి వ్యయంలో కలుపుతారు. అంటే ఉత్పత్తుల ధరలు పెంచుతారు. అంటే కమర్షియల్ గ్యాస్ వినియోగించే అన్ని రంగాలపై ఈ ప్రభావం పడుతుంది. అంటే వినియోగదారుడి నడ్డి విరగడం ఖాయం. రంగాల వారీగా దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ చూడవచ్చు:
|
రంగం |
వినియోగం |
సామాన్యుడిపై భారం |
| వెల్డింగ్ | గ్యాస్ కట్టింగ్, జాయింట్స్ | గేట్లు, గ్రిల్స్ ధరల పెరుగుదల |
| ఆటోమొబైల్ | బాడీ డెంటింగ్, రిపేర్స్ | వెహికల్ మెయింటెనెన్స్ ఖర్చు పెరుగుదల |
| బంగారు షాపులు | లోహాలను కరిగించడం | మేకింగ్ చార్జీల పెంపు |
| పౌల్ట్రీ | హీటర్ల నిర్వహణ | చికెన్, ఎగ్ ధరలపై పరోక్ష ప్రభావం |
ఆహార రంగం (Hotels & Restaurants) – అత్యధిక ప్రభావం
కమర్షియల్ గ్యాస్ వినియోగంలో అగ్రభాగం హోటళ్లు మరియు రెస్టారెంట్లదే. గ్యాస్ ధరలు పెరిగిన వెంటనే హోటల్ యజమానులు చేసే మొదటి పని ‘మెనూ కార్డు’ మార్చడం. పోపు వేయడానికి ఖర్చయ్యే ధరను కూడా వీరు లెక్కిస్తారు.
టిఫిన్ సెంటర్లు & చిన్న హోటళ్లు: ఇడ్లీ, దోశ, వడ వంటి టిఫిన్ల ధరలను ప్లేటుకు రూ. 5 నుండి రూ. 10 వరకు పెంచుతారు. గ్యాస్ ధర పెరిగిందని సాకు చెప్పి, చట్నీ లేదా సాంబార్ పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంటారు.
రెస్టారెంట్లు & బిర్యానీ పాయింట్లు: ఒక సిలిండర్ ధర రూ. 100 పెరిగితే, వీరు ప్రతి బిర్యానీ ప్లేటుపై రూ. 20 నుండి రూ. 30 వరకు పెంచే అవకాశం ఉంది. అలాగే కూరలు (Curries), స్టార్టర్స్ ధరలు కూడా గణనీయంగా పెరుగుతాయి.
టీ & కాఫీ స్టాళ్లు: గ్యాస్ ధరల సాకుతో ఒక కప్పు టీ లేదా కాఫీ ధరను రూ. 2 నుండి రూ. 5 వరకు పెంచుతారు. రోజువారీగా టీ తాగే సామాన్యుడిపై ఇది నెలవారీగా పెద్ద భారాన్ని చూపుతుంది.
బేకరీ మరియు స్వీట్ తయారీ – పరోక్ష ప్రభావం
పండుగలు లేదా శుభకార్యాల సమయంలో స్వీట్ తయారీ దారులు గ్యాస్ ధరల పెరుగుదలను ప్రధానంగా వినియోగిస్తారు.
స్వీట్ షాపులు: స్వీట్ల తయారీకి ఎక్కువ సమయం గ్యాస్ వాడాల్సి ఉంటుంది కాబట్టి, కేజీ స్వీటుపై రూ. 20 నుండి రూ. 50 వరకు ధర పెంచే అవకాశం ఉంది.
బేకరీ ఉత్పత్తులు: కేకులు, పఫ్స్, బిస్కెట్ల తయారీలో వాడే ఓవెన్లకు కమర్షియల్ గ్యాస్ లేదా విద్యుత్ అవసరం. గ్యాస్ ధర పెరిగితే పఫ్స్ వంటి చిరుతిళ్ల ధరను రూ. 2 నుండి రూ. 5 వరకు పెంచుతారు.
స్ట్రీట్ ఫుడ్ (Fast Food): నూడుల్స్, మంచూరియా వంటి బండి మీద దొరికే ఆహార పదార్థాల ధరలు కూడా ప్లేటుకు రూ. 10 వరకు పెరిగే ప్రమాదం ఉంది.
కేటరింగ్ మరియు ఫంక్షన్ హాల్స్ – భారీగా బిల్లులు
ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అంటారు కదా? ఇక శుభకార్యాలకు ఆర్డర్లు తీసుకునే కేటరింగ్ సర్వీసుల వారు గ్యాస్ ధరల పెరుగుదలను ఆసరా చేసుకుని మొత్తం ప్యాకేజీని పెంచేస్తారు. వీరి మోత మాములగా ఉండదు.
కేటరింగ్: ఒక్కో ప్లేట్ భోజనానికి రూ. 10 నుండి రూ. 20 వరకు అదనంగా వసూలు చేస్తారు. గ్యాస్ సిలిండర్ల ఖర్చు పెరిగిందని చూపిస్తూ, లేబర్ మరియు ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులను కూడా కలిపి కస్టమర్లపై భారం వేస్తారు.
చిన్న తరహా పరిశ్రమలు: అప్పడాలు, వడియాలు, పచ్చళ్లు వంటి గృహోపయోగ వస్తువులను కమర్షియల్ గ్యాస్‌తో తయారు చేసే చిన్న యూనిట్లు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచుతాయి.
వెల్డింగ్ మరియు గ్యాస్ కట్టింగ్ షాపులు
లోహాలను అతికించడానికి లేదా కట్ చేయడానికి ఎల్‌పిజిని ఆక్సిజన్‌తో కలిపి వినియోగిస్తారు. దేశంలో హోటల్ రంగం తరువాత ఎక్కవగా కమర్షియల్ ఎల్పీజి వినియోగం ఇక్కడే ఉంటుంది.
తక్షణ ప్రభావం: వెల్డింగ్ సిలిండర్ ధర పెరగడం వల్ల వెల్డింగ్ షాపుల యజమానులు ప్రతి చిన్న పనికి (ఉదాహరణకు: గేటు రిపేరు లేదా మోటారు పని) కనీసం రూ. 20 నుండి రూ. 50 అదనంగా వసూలు చేస్తారు. రూ. 100 పెంచినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు.
ఐరన్ వర్క్స్: కిటికీ గ్రిల్స్, గేట్లు మరియు ఇతర ఇనుప సామాగ్రి తయారీ ఖర్చులు పెరుగుతాయి. కొత్త ఇల్లు నిర్మించే వారికి ఇది అదనపు భారం అవుతుంది.
ఆటోమొబైల్ బాడీ వర్క్స్ (Garages)
కార్ల రిపేరింగ్ మరియు బాడీ పెయింటింగ్ చేసే గ్యారేజీలలో పాత పెయింట్ తొలగించడానికి లేదా లోహాలను వంచడానికి గ్యాస్ టార్చ్‌లను ఉపయోగిస్తారు.
ధరల పెరుగుదల వల్ల వాహనాల మరమ్మతు ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల సామాన్యుడు తన బైక్ లేదా కారు రిపేరు కోసం గతంలో కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తుంది.
జ్యువెలరీ తయారీ (Gold Smiths)
ఇప్పటికే బంగారు, వెండి ధరలు ఆకాన్ని అంటుతున్నాయి. బంగారానికి కమర్షియల్ గ్యాసుకు లింకేంటి విచిత్రం కాకపోతే అనుకునే వారు ఉంటారు. కానీ, బంగారం, వెండి ఆభరణాలను కరిగించడానికి మరియు డిజైన్లు చేయడానికి చిన్నపాటి గ్యాస్ బర్నర్లను వాడతారు. ఇవి కమర్షియల్ కిందకే వస్తాయి. ప్రతి చిన్న ఊర్లోను వీటిని వినియోగం ఉంటుంది.
ప్రభావం: ఆభరణాల తయారీ కూలి (Making Charges) పై ఇది ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా సూక్ష్మమైన పని చేసే స్వర్ణకారులు తమ ఖర్చులను కవర్ చేసుకోవడానికి తయారీ చార్జీలను స్వల్పంగా పెంచుతారు.
ఇతర పారిశ్రామిక రంగాలు
పౌల్ట్రీలు: కోడి పిల్లలకు వెచ్చదనం అందించడానికి (Brooding) గ్యాస్ హీటర్లను ఉపయోగిస్తారు. ఇక్కడ ధర పెరిగితే కోడి మాంసం (Chicken) ధరలపై అది పరోక్ష ప్రభావం చూపుతుంది. అంటే చికెన్ ధరలు కూడా పెరుగుతాయన్నమాట.
టెక్స్‌టైల్స్: బట్టలపై ప్రింటింగ్ చేసే సమయంలో రంగులను ఆరబెట్టడానికి కొన్ని చోట్ల గ్యాస్ సిలిండర్లను వాడుతుంటారు. దీనివల్ల దుస్తుల తయారీ వ్యయం పెరుగుతుంది. ఇక్కడ కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది.
మొత్తంపై మన కేంద్ర ప్రభుత్వం జనానికి నొప్పి తెలియకుండా రక్తం తాగడానికి సిద్ధమయిపోయిందన్నమాట.
వాణిజ్య గ్యాస్ ధరల పెరుగుదల వల్ల హోటల్, బేకరీ మరియు కేటరింగ్ రంగాల్లో పెరిగే ధరల వివరాలు మరియు సామాన్యుడిపై పడే భారంపై విశ్లేషణ.
#GasPriceHike #HotelFood #Inflation #CommercialLPG #CostOfLiving
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.