స్వచ్ఛాంధ్ర సాధనే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ
స్వచ్ఛాంధ్ర సాధనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు (Chittoor MP Dagumalla Prasad Rao) అన్నారు. పల్లె ప్రాంతాలు పారిశుద్ధ్యానికి మార్గదర్శకంగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) సంకల్పమని ఆయన తెలిపారు.
పంచాయతీల ప్రగతిని దృష్టిలో ఉంచుకొని తడి చెత్త–పొడి చెత్త సేకరణ కోసం గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి (Gangadhara Nellore Constituency) ఈ-ఆటోలను (E-Autos for Waste Management) అందించినట్లు ఎంపీ వివరించారు. భవిష్యత్తులో చిత్తూరు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు ఈ-ఆటోలను అందించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎంపీ నిధుల ద్వారా (MP LAD Funds) మంజూరైన 20 ఈ-ఆటోలను సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం (Chittoor District Collector Office) ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ (District Collector Sumith Kumar)తో కలిసి, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ (MLA Dr Thomas) సమక్షంలో నియోజకవర్గానికి అందజేశారు. అనంతరం జెండా ఊపి ఈ-ఆటోలను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛతే సేవ కార్యక్రమం (Swachhata Hi Seva Andhra Pradesh) విజయవంతంగా అమలవుతోందన్నారు. ఈ-ఆటోల ద్వారా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి సేకరించి సంపద సృష్టి దిశగా (Wealth from Waste Initiative) అడుగులు వేయవచ్చని తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు.
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ, ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు చొరవతో ఎంపీ నిధుల ద్వారా ఈ-ఆటోలు తమ నియోజకవర్గానికి అందడం హర్షణీయమన్నారు. ఈ-ఆటోల సహాయంతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తామని, అదే సమయంలో సంపద సృష్టికి కూడా కృషి చేస్తామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ-ఆటోలు పంచాయతీల అభివృద్ధికి మరింత తోడ్పాటునిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ కుమారి అముద (Chittoor Mayor), చూడా చైర్‌పర్సన్ కఠారి హేమలత (CHUDA Chairperson), మాజీ ఎమ్మెల్యే మనోహర్, కార్పొరేటర్ అశోక్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బాబు (SC Corporation Director), మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, మాజీ ఎంపిటిసి తిరుమల, గంగాధర నెల్లూరు కూటమి నాయకులు, కార్యకర్తలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.