సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపన్న హస్తం.. ఆర్తులకు అండగా సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సీఎం రిలీఫ్ ఫండ్ (CM Relief Fund) ద్వారా ఆప్తులకు ఆపన్న హస్తాన్ని అందిస్తూ సేవా నిరతిని చాటుకుంటున్నారని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు (Chittoor MP Daggumalla Prasada Rao) ప్రశంసించారు.
వివిధ కారణాలు, పలు రకాల వ్యాధులతో ఆసుపత్రుల పాలై ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్తులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు సేవా తత్వానికి నిదర్శనమని అన్నారు.
చిత్తూరు ఎంపీ సిఫార్సుతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.7,52,780 (CM Relief Fund Assistance) విలువైన చెక్కులను మంగళవారం చిత్తూరు ఎంపీ కార్యాలయంలో ఏడుగురు ఆర్తులకు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు (TDP Leaders) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాధితుల కుటుంబ నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్న ఎంపీ, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ కూటమి ప్రభుత్వం (Alliance Government) బాసటగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మానవీయతకు పెట్టింది పేరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (Chief Minister Assistance Fund) పేదల పాలిట పెన్నిధిగా మారిందని వ్యాఖ్యానించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకున్న ఆర్తులు, తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావులకు కృతజ్ఞతలు తెలిపారు.
#CMReliefFund
#ChandrababuNaidu
#ChittoorMP
#DaggumallaPrasadaRao
#HelpingHand
#AllianceGovernment
#PublicWelfare
#AndhraPradesh