March 10, 2026

తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్మాణం: మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం:తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది” అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ఉద్దేశంతో ‘షైనింగ్ స్టార్స్ అవార్డులు’ అందజేస్తున్నట్టు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 172 మందికి అవార్డులు అందజేశారు.

శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి వేదికగా నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో quality (నాణ్యత), standards (ప్రమాణాలు) పెంచే దిశగా అవార్డులు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతిభను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలను మంత్రి గుర్తుచేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, Quantum Valley వంటి ఆధునిక టెక్నాలజీల వైపు విద్యార్థులు దృష్టి సారించాలన్నారు. “Smart Work చేస్తూ టెక్నాలజీని అందిపుచ్చుకునే విద్యార్థులకే భవిష్యత్తు ఉంటుంది” అని స్పష్టం చేశారు. 2030 నాటికి ₹2500 కోట్లు పెట్టుబడి, 2 బిలియన్ డాలర్ల క్వాంటం ఎకానమీ, 5000 స్కిల్డ్ ఉద్యోగాలు సాధ్యం చేస్తామన్నారు.

విద్యార్థులకు మంత్రి సూచనలు: విద్యలో పట్టుదల, సృజనాత్మకత, Technology usage (సాంకేతిక వినియోగ సామర్థ్యం) అలవరచుకోవాలన్నారు. అలాగే, drugs (మత్తు పదార్థాలు) బానిసలుగా మారకుండా, discipline (క్రమశిక్షణ)తో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల వంటి మౌలిక వసతుల కొరత వల్ల డ్రాప్‌ఔట్ రేటు పెరిగిందని, ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కలెక్టర్ పి. ప్రశాంతి, కమిషనర్ కేతన గార్గ్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *