
జనాభా రోజురోజుకు పడిపోతోంది. మరోవైపు అక్కడ పెళ్ళికాని ప్రసాదులే ఎక్కువ. ఒకవేళ పెళ్ళి చేసుకున్నా, ఒకరికంటే ఎక్కువ మందిని కనేందుకు ఇష్టపడరు. కానీ, తగ్గుతున్న జనాభాతో ఆదేశం తీవ్ర ఆందోళన చెందుతోంది. దీంతో పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి అంటోంది చైనా ప్రభుత్వం. ఇది అధికారిక సందేశంగా మారింది.
జనాభా తగ్గుదల (population decline)పై ఆందోళన చెందుతున్న చైనా, పెళ్లిళ్లు మరియు పిల్లల పుట్టించుకునే వారిని ప్రోత్సహించేందుకు వివాహ సెలవులను (marriage leave) గణనీయంగా పెంచింది. ఇప్పటి వరకు పెళ్ళికి కేవలం 3 రోజుల సెలవులే ఉండేవి. మూణ్నాళ్ళ ముచ్చట తీరక ముందే పని చేరాల్సి వచ్చేది. దీంతో ఈ పెళ్ళే మాకొద్దని చాలా మంది పెళ్ళిపై ఆసక్తి చూపేవారు కాదు. పెరుగుతున్న ఖర్చులను తట్టుకోలేక కొందరు ఒకరిని కొంత మంది అసలు పిల్లలే లేకుండా కాలం గడిపేసేవారు. దీంతో కొన్ని ప్రావిన్స్‌లలో పెళ్ళి సెలువులు 25 నుంచి 30 రోజుల వరకూ పెంచేశారు. హనీమూన్ కాలంలో పూర్తి జీతంతో (full salary) ఇవ్వనున్నారు.
ఉదాహరణకు, సిచువాన్ ప్రావిన్స్ (Sichuan Province) పెళ్లికి 20 రోజుల సెలవు ప్రకటించగా, వైద్య పరీక్షలు చేయించిన వారికి మరో 5 రోజుల అదనపు సెలవు కూడా లభిస్తోంది. ఇదంతా 2024 జూన్ వరకు ప్రజాభిప్రాయ సేకరణలో (public consultation) జరిగింది. అలాగే షెడాంగ్, షాన్సీ, గాన్సూ వంటి ఇతర ప్రాంతాలు కూడా 18 నుంచి 30 రోజుల వరకూ సెలవులు ప్రకటించాయి. కేంద్రస్థాయిలో 1980 నుంచే కేవలం 3 రోజుల సెలవే అమలులో ఉంది.
చైనాలో పెళ్లిళ్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి. 2025 తొలి త్రైమాసికంలో కేవలం 1.81 మిలియన్ జంటలు మాత్రమే పెళ్లి నమోదు చేసుకున్నారు – ఇది గతేడాది కంటే 8 శాతం తక్కువ. ఇది 1980 తర్వాత అత్యల్ప స్థాయిగా నమోదైంది. పిల్లల్ని కనడం వేగంగా తగ్గిపోతుంది, ఎందుకంటే యువత పెళ్లి విషయాన్ని పిల్లల ప్రణాళికతోనే అనుసంధానిస్తున్నాడు. ఎడ్యుకేషన్, కెరీర్, ఫ్రీడమ్ వంటివి కూడా ఈ ధోరణికి కారణాలుగా చెప్పబడుతున్నాయి.
ప్రభుత్వం ఇప్పుడు పెళ్లి నమోదు ప్రక్రియను (marriage registration process) సులభతరం చేస్తోంది. హుకౌ (hukou – household registration) లేకుండానే ఏ నగరంలోనైనా పెళ్లిని నమోదు చేసుకోవచ్చు. అంతేకాదు, maternity మరియు paternity leaves కూడా పెంచే యోచనలో ఉంది. అయితే, ఈ అన్ని ప్రోత్సాహకాలు వాస్తవంగా అమలవుతాయా, లేక కేవలం on paper పరిమితమవుతాయా అన్నదానిపై ప్రజలలో సందేహాలు ఉన్నా, సర్కార్ కంపెనీలకు సహాయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.