March 15, 2026

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ .. ఐదుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. తెలంగాణ సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతమైన కర్రెగుట్టలో గురువారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు. మావోయిస్టు నేత దేవ్‌ జీ లక్ష్యంగా భద్రతా దళాలు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టు కీలక నేతలు మరణించినట్లు సమాచారం.
#ChhattisgarhEncounter #Maoists #BreakingNews #SecurityForces #Naxalites #ForestSearch #BorderAlert

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *