వలసారెడ్డి వెంకటరెడ్డి కర్మక్రియల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం రంగన్నగారిగడ్డకు చెందిన వలసారెడ్డి వెంకటరెడ్డి సుదీర్ఘకాలంగా కర్ణాటక రాష్ట్రంలోని బన్నరి అమ్మన్ షుగర్స్ లిమిటెడ్ కు వైస్ఛైర్మన్గా సేవలు అందించారు. ఈనెల6వ తేదీన ఆయన ఆకస్మికంగా మరణించడంతో దశదిన కర్మక్రియలు బుధవారం రంగన్నగారిగడ్డ గ్రామంలోని ఆయన ఫాం హౌస్లో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యాపార వేత్తలు, రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. అందులో భాగంగా తుడా మాజీ ఛైర్మన్, చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా వెంకటరెడ్డి సమాధిని సందర్శించి అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.
#ChevireddyMohithReddy #Chandragiri #ValasareddyVenkataReddy #YSRCP #TirupatiDistrict #Chinnagottigallu #Tribute #BusinessLeader

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
