సుబ్బులమ్మకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నివాళి..!
పాకాల మండలం పెరసానిపల్లి పంచాయతీ గుండ్ల గుట్ట పల్లి గ్రామంకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ ఎ.సుబ్ర మణ్యం తల్లి సుబ్బులమ్మ మృతి చెందారు. ఆ విషయం తెలుసుకున్న చంద్రగిరి నియోజక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బుధవారం ఆ గ్రామానికి వెళ్లి సుబ్బులమ్మ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం సుబ్రమణ్యం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నివాళులు అర్పించిన వారిలో పాకాల మండలం పార్టీ నాయకులు వున్నారు.
#YSRCP #ChevireddyMohitReddy #Chandragiri #Pakala #Condolences #TirupatiNews #PoliticalUpdates
