ఒంగోలులో చెవిరెడ్డికి బ్రహ్మరథం: 226 రోజుల తర్వాత భారీ ఎత్తున జనసందోహం
విజయవాడలో వైఎస్ జగన్‌ను కలిసిన అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేరుగా ఒంగోలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు అడుగుడుగునా నీరాజనాలు పలికారు.
విజయవాడ నుంచి సుమారు 50 కార్లతో భారీ కాన్వాయ్‌గా ఆయన ఒంగోలుకు బయలుదేరారు. జాతీయ రహదారి పొడవునా కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. కిమ్స్ ఆసుపత్రి సర్కిల్ వద్ద జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ముఖ్య నాయకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఒంగోలు పట్టణంలోకి ప్రవేశించగానే మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీసి, హారతులతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ ఆదరణ చూసి చెవిరెడ్డి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
ఒంగోలులోని పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల నినాదాలతో కోలాహలం నెలకొంది. సాయంత్రం 7:30 గంటల వరకు చెవిరెడ్డి పార్టీ కార్యాలయంలోనే ఉండి, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల నుంచి వచ్చిన ముఖ్య నేతలతో మమేకమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం తనను రాజకీయ కక్షలతో ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో, అక్రమంగా ఎలా నిర్బంధించిందో ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ కోసం, జగన్ కోసం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
#ChevireddyBhaskar Reddy #Ongole #YSRCP #AndhraPradeshPolitics #BailUpdate #PoliticalGrandWelcome #TDPvsYSRCP
