చెయ్యేరు, కోనసీమ – మే 31: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన సంక్షేమ పాలనకు పింఛన్లు దృశ్యమాన నిదర్శనమని చెయ్యేరు సభలో ప్రస్తావించారు. కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఉపాధి హామీ కూలీలు రత్నం, మరియమ్మలకు పెన్షన్లు అందిస్తూ వారితో ముచ్చటించారు.
సామాజిక సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న ఆయన, రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీని నెల ప్రారంభం కంటే ఒకరోజు ముందే ప్రారంభించామని వివరించారు. ప్రస్తుతం 64 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా 1వ తేదీన రూ.4000 పెన్షన్ అందిస్తామన్నారు. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రూ.34,000 కోట్ల పెన్షన్ల నిధులను విడుదల చేయడం దేశంలోనే ఏ ప్రభుత్వమూ చేయలేనిదని పేర్కొన్నారు.
పొలిటికల్ ఫైర్ – విమర్శలపై స్పందన
మునుపటి వైసీపీ పాలనలో వితంతు పింఛన్లను పట్టించుకోలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 71,380 మంది వితంతువులకు మళ్ళీ పింఛన్లు మంజూరు చేశామని చెప్పారు. మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ రూ.1000-2500 మాత్రమే పెన్షన్లు అందుతున్నప్పటికీ, ఏపీ పింఛన్ విధానం దేశంలోనే అత్యుత్తమమని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేస్తూ… ఉపాధ్యాయ నియామకాలకు మెగా డీఎస్సీ నిర్వహిస్తున్నామని, 5 లక్షల మంది వర్క్ ఫ్రం హోమ్ ద్వారా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల నిధులు, రోడ్ల మరమ్మతులకు రూ.1200 కోట్లు ఖర్చు, అన్నా క్యాంటీన్లు, బకాయిలు చెల్లింపులు వంటి ఎన్నో అంశాలను వివరించారు.
చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉండగా, సంఘీభావం తెలిపిన రూ.4 వేలు పెన్షన్ తీసుకున్న పెద్దమ్మ.#PensionsPandugalnAP#NTRBharosaPension#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/TMfWaiJ4NY
— Telugu Desam Party (@JaiTDP) May 31, 2025
పవర్ పంచ్ – శ్రేణులపై హెచ్చరికలు, భవిష్యత్తు హామీలు
పోలవరానికి చేరిన రాజకీయ విమర్శలపై కూడా ఆయన స్పందించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై శాటిలైట్ డ్రోన్ల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పిల్లల జనాభా పెంచాల్సిన అవసరాన్ని చర్చిస్తూ, ప్రతి తల్లికి “వందనం” కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
అగస్టు 15నుంచి మహిళల ఉచిత బస్సు ప్రయాణం, జూన్ నుండి “అన్నదాత సుఖీభవ”, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు వంటి భవిష్యత్ కార్యక్రమాలపై దృష్టి పెట్టామని తెలిపారు.
కడప మహానాడులో ప్రజల స్పందనతో ఉత్సాహంగా ఉన్నానని చెప్పిన సీఎం, “ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజలదే” అని స్పష్టం చేశారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.