కాలుష్యం లేదా.. ఇది ప్రమాదకరం కాదా? రండీ నేను చూపిస్తానంటూ నదిలోనే స్నానానికి దిగి ప్రాణాల మీదుకు తెచ్చకున్నాడు ఓ బీజేపీ నాయకుడు.చివరకు ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.
యమునా నది కాలుష్యంపై ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తున్నాయి. అటు ఆప్, ఇటు బీజేపీ నాయకులు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఇవి కాస్తా హద్దులు దాటాయి.
పౌరుషానికి పోయిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా బుధవారం యమునా నదిలో ఐటిఒ ఛత్ ఘాట్ వద్ద స్నానం చేశారు. నదిలో స్నానానికి రావాల్సిందిగా ఆయన మాజీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, సిఎం అతిషిని ఆహ్వానించారు.
సీఎం, మాజీ సీఎం కూర్చోవడానికి బీజేపీ రెడ్‌కార్పెట్‌పై రెండు కుర్చీలు కూడా వేసింది. వారు రాకపోవడంతో యమునా నదిలోకి దిగి స్నానం చేశారు.
నదిలో స్నానం చేసిన తరవాత సచ్‌దేవ ఆరోగ్యం క్షీణించింది. అతను చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలయ్యింది. ఆసుపత్రికి పరుగులు పెట్టాడు. అక్కడ చికిత్స పొందుతున్నాడు. కోరి కష్టాలు తెచ్చువడం అంటే ఇదే మరి.
దేశరాజధాని ఢిల్లీ కాలుష్యానికి నెలవుగా మారిన విషయం తెలిసిందే. యమునా నదిలో విషపూరితమైన నురగ కాలుష్యానికి కారకంగా తెలుస్తోంది.