March 10, 2026

హనుమంత వాహనంపై శ్రీరాముడిగా ప్రసన్న వేంకటేశ్వరుడు

అప్పలాయగుంట (Appalayagunta) శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం స్వామివారు హనుమంత వాహనం (Hanumantha Vahanam) పై శ్రీ రామావతారం (Srirama Avataram) అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం గజ వాహనసేవ (Gaja Vahanam) తో స్వామివారు భక్తులకు కనుల పండువ చేయనున్నారు.

అప్పలాయగుంట, జూన్ 12: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavams) భాగంగా గురువారం ఉదయం 8.00 గం.లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు హనుమంత వాహనం (Hanumantha Vahanam) పై శ్రీ రామావతారం (Srirama Avataram) అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.

ఉదయం 08.00 గంటలకు హనుమంత వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3.00 – 4.00 గం.ల మధ్య పుణ్యహం, వసంతోత్సవం నిర్వహించారు.

రాత్రి 7.00 గం.లకు గజ వాహనం (Gaja Vahanam) పై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించనున్నారు. వాహన సేవలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్‌  శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *